హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. మూడు చోట్ల చోరీ!

NGKL: వెల్దండ మండల కేంద్రంలో వరుస చోరీలు కలకలం రేపాయి. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. రెండు ఇళ్లలో నగదు, మరో ఇంట్లో మొబైల్ ఫోన్ అపహరించారు. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లిన వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.