BDK: కార్తీక మాసంలోని కోటి సోమవారం సందర్భంగా భద్రాచలం గోదావరి ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. మహిళలు అరటి దొప్పల్లో దీపాలను నదిలో వదిలారు. ఆలయంలో గురుస్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప మాలధారణ, మండల దీక్షలు ప్రారంభమయ్యాయి. స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు.
తెలంగాణ
గోదావరి ఘాట్లు భక్తులతో కిటకిట!

