హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవంబర్ 17న చేయూత పింఛన్ల పంపిణీ

WNP: వీపనగండ్ల మండల కేంద్రంలో నవంబర్ 17న చేయూత నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై పానగల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల లబ్ధిదారులకు పింఛన్లు అందజేయనున్నారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు హాజరుకావాలని మండల అధ్యక్షుడు రావుల నారాయణరెడ్డి కోరారు.