హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను విజయవంతం చేయాలి: కలెక్టర్

ADB: రాష్ట్రంలో నిర్వహించనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రి వాకిటి శ్రీహరి, సీఎస్ సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. డిసెంబర్ 11 నుంచి జరిగే క్రీడలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.