హైదరాబాద్: 28°C
తెలంగాణ

చింతలపాలెంలో పెరుగుతున్న మిర్చి సాగు

SRPT: వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా చింతలపాలెం మండలంలోని ఎత్తిపోతల పథకాలు రైతులకు అండగా నిలుస్తున్నాయి. 16 గ్రామాల్లో 19,500 ఎకరాలకు సాగునీరు అందుతుండటంతో బీడు భూములు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. మిర్చి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది. సాధారణ వర్షపాతం కంటే 48.27 శాతం లోటు నమోదైనా ఎత్తిపోతల నీటితో రైతులకు ఉపశమనం లభిస్తోంది.