హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీహెచ్‌సీని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌‌వో

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌‌వో డాక్టర్ శ్రీనివాస్ సోమవారం సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్య సేవలకు సంబంధించిన రికార్డుల నిర్వహణ, ఆసుపత్రి పనితీరు, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.