హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ సందేశాలపై కలెక్టర్ హెచ్చరిక

WNP: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పేరు, ఫొటోతో నకిలీ వాట్సాప్ ఖాతాలు సృష్టించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా 9813015576 నంబర్ నుంచి వచ్చే సందేశాలను నమ్మవద్దని, డబ్బులు పంపవద్దని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైనట్లు తెలిపారు.