NZB: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావును టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సోమవారం పరామర్శించారు. ఇటీవల సిద్దిపేట సభకు నిజామాబాద్ నుంచి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో అవంతి రావు గాయపడ్డారు. నగరంలోని ప్రగతినగర్లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన కవిత ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
అవంతి రావును పరామర్శించిన కవిత


