హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాటేపల్లి తండాలో మినీ రేషన్ షాప్

KMR:పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లి తండాలో మినీ రేషన్ షాప్‌ను తహసీల్దార్ రాజశేఖర్ సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ షాప్‌తో తండా ప్రజలకు స్థానికంగానే రేషన్ సరుకులు అందనున్నాయి. షాప్ కోసం ఉచితంగా స్థలం, టీన్ షెడ్డు అందించిన పాండు నాయక్‌ను తహసీల్దార్ శాలువాతో సన్మానించారు.