హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెంచికల్ పేట్ PHCలో అంబులెన్స్ ఏర్పాటు చేయాలి'

ASF: పెంచికల్ పేట్ మండల కేంద్రంలో గల PHCలో 108 అంబులెన్స్ ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్ కోరారు. ఈ మేరకు సోమవారం MPDOకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ.. 108 అంబులెన్స్ లేక అత్యవసర పరిస్థితిలో ప్రజల ప్రాణాలు రక్షించుటలో ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు.