హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతుల కుటుంబాలకు పొదుపు సంఘం ఆర్థిక భరోసా

SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పురుషుల పొదుపు సంఘం మానవీయత చాటుకుంది. సంఘ సభ్యులు మెడదుల నర్సయ్య, మిడిదొడ్డి లచ్చయ్య మృతితో వారి కుటుంబాలకు అండగా నిలిచి నామినీలకు వరుసగా రూ.1,03,448, రూ.95,289 చొప్పున మొత్తం రూ.1,98,737 ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు, అకౌంటెంట్ పాల్గొన్నారు.