హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప భక్తులకు నిత్యాన్నదానం ప్రారంభం

SRCL: వేములవాడ పట్టణంలో అయ్యప్ప స్వామి నిత్యాన్నదాన భవనాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. వేములవాడకు వచ్చే అయ్యప్ప భక్తులకు నిత్యం భోజనం, అల్పాహారం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విప్ సూచించారు. కార్యక్రమంలో నిత్యాన్నదాన ఛైర్మన్ రాచర్ల శ్రీనివాస్ గురుస్వామి పాల్గొన్నారు.