హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచారామ యాత్రలకు ప్రత్యేక బస్సులు

BHPL: కార్తీక మాసం సందర్భంగా భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి పంచారామ క్షేత్రాలు, అరుణాచలం యాత్రలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ చేరాల మురళీకృష్ణ తెలిపారు. 36 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది భక్తులు బృందంగా ఉంటే ఇంటి వద్దకే బస్సు పంపిస్తామని పేర్కొన్నారు. అయ్యప్ప భక్తుల కోసం కూడా ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.