హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంటోన్మెంట్‌లో 1,459 మందికి నూతన పెన్షన్లు

HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో 1,459 మందికి నూతనంగా చేయూత పెన్షన్లు మంజూరయ్యాయి. బాలంరాయిలోని లీ ప్యాలెస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రియాంక ఆల, ఎమ్మెల్యే శ్రీగణేష్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. తిరుమలగిరిలో 833, మారేడ్‌పల్లిలో 161, సికింద్రాబాద్‌లో 465 మందికి పెన్షన్లు మంజూరయ్యాయి.