GDWL: అలంపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం అధికారులు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కార్యాలయం ముందర వాహనదారుల ద్విచక్ర వాహనాలను నిలుపుతున్నారు. దీంతో అర్జీదారులు కార్యాలయం లోపలికి వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి వాహనాలను ఒక వైపు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: వాహనాలు ఇలా.. వెళ్ళేది ఎలా!


