హైదరాబాద్: 28°C
తెలంగాణ

మక్తల్‌లో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మిస్తాం: మంత్రి

NRPT: మక్తల్ మున్సిపాలిటీలో మినిస్టర్ కప్ 2026-27 సీజన్-1 క్రికెట్ పోటీలను సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ పోటీల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొననున్నారు. మక్తల్‌లో రూ.25 కోట్లతో ఆధునాతన స్టేడియం నిర్మిస్తామని, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు.