JGL: నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు వరమని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో సోమవారం తురక సుజాత, తురక రాణి మోహన్ ఇళ్ల గృహప్రవేశానికి హాజరై నూతన ఇళ్లను ప్రారంభించారు. అర్హులందరికీ ఇళ్లు ఇవ్వడమే లక్ష్యమని అన్నారు. లబ్ధిదారులకు చీరలు అందజేశారు. డీసీసీ అధ్యక్షుడు గజంగి నందయ్య, సర్పంచ్ కట్ట రాజేందర్ పాల్గొన్నారు.
తెలంగాణ
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు వరం: ఎమ్మెల్యే


