NZB: మాక్లూర్ మండలంలో అర్హులైన లబ్ధిదారులకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సోమవారం నూతన పెన్షన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తెలంగాణ
పెన్షన్ పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


