ADB: బోథ్ మండలంలోని మంద బొగుడ గ్రామ పంచాయతీ పరిధిలోని కుచిర్యాల గ్రామంలో పశువుల తొట్టి నిర్మాణానికి సర్పంచ్ జాదవ్, బాబూలాల్, టెక్నికల్ అసిస్టెంట్ నరేష్‌తో కలిసి సోమవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. దీంతో పశువులకు తాగునీటి సమస్య తీరనుందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి షకీల్ అహ్మద్ తదితరులున్నారు.
తెలంగాణ
పశువుల తాగునీటి సమస్యకు పరిష్కారం..!


