హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీధి కుక్కల దాడిలో ఐదుగురికి గాయాలు

KMR: గాంధారి మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీలో సోమవారం వీధికుక్క దాడిలో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. మరో గ్రామంలో తొమ్మిదేళ్ల బాలికపైనా కుక్క దాడి చేసింది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఆగ్రహించిన స్థానికులు కుక్కను చంపేశారు. వీధికుక్కల బెడదను అరికట్టేందుకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.