హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్తీక మాసంలో ప్రత్యేక బస్సు యాత్ర: డిపో మేనేజర్

NZB: కార్తీక మాసం సందర్భంగా TGSRTC NZB–2 డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు యాత్ర ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సోమవారం తెలిపారు. ఈ నెల 20న నిజామాబాద్ నుంచి బయలుదేరి రేచింతల్, బీదర్, గానుగాపూర్, పండరీపురం పుణ్యక్షేత్రాలను దర్శించుకొని 22న తిరిగి చేరుకుంటుందని పేర్కొన్నారు. పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.1,875 టికెట్ ధరగా నిర్ణయించినట్లు వెల్లడించారు.