హైదరాబాద్: 28°C
తెలంగాణ

తండాలో మద్యం అమ్మకాలపై నిషేధం

MDK: టేక్మాల్ మండలం సర్మాన్ కుంట తండాలో గ్రామ సభ వేదికగా సర్పంచ్ రేణుక రంగ్లాల్ కీలక తీర్మానం చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ తీర్మానం ఆమోదించారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే రూ.5 లక్షల జరిమానా విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్పంచ్ నిర్ణయంపై తండా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.