హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నీటి సంరక్షణకు ముందుకు రావాలి'

NLG: మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లిలో సర్పంచ్ లపంగి నర్సింహా ఆధ్వర్యంలో ఐదు ఇళ్ల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఒక్కో గుంత నిర్మాణానికి ప్రభుత్వం రూ.6,500 ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొగాకు పెద్ద సైదులు, కాంగ్రెస్ మండల నాయకుడు రాగుల రాములు తదితరులు పాల్గొన్నారు.