హైదరాబాద్: 28°C
వార్తలు

బిల్కిస్ బానో కేసు దోషులకు సుప్రీం బెయిల్

బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్, హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరి శిక్షను నిలిపివేసింది. వీరు 17 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారని, వారిలో ఒకరికి తీవ్ర వైకల్యం ఉందన్న వాదనలతో జస్టిస్ ఎం.ఎం.సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం ఏకీభవించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.