యమునా నదిలో కాలుష్యంపై బీజేపీ, ఆప్ పరస్పర విమర్శలకు దిగాయి. నదిని శుభ్రం చేశామంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఆప్ మండిపడింది. నదిలో చేపలు చనిపోయాయని.. భారీగా నురగ పైకి తేలిందని.. ప్రచారానికి కోట్లు వృథా అంటూ ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ పోస్టు పెట్టారు. నకిలీ యమున మరోసారి బయటపడిందంటూ ధ్వజమెత్తారు. నదిలో చనిపోయిన చేపలను వేస్తూ ఆప్ కుట్రపన్నుతోందంటూ బీజేపీ ఆరోపించింది.
వార్తలు
యమునా కాలుష్యంపై బీజేపీ, ఆప్ వాగ్వాదం


