హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సర్పంచ్‌పై సమైక్య సంఘాల మహిళల ఫిర్యాదు

ASF: తిర్యాణి మండలం తలండి గ్రామపంచాయతీ సర్పంచ్ మంగుపై సమైక్య సంఘాల మహిళలు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామస్థుల డబ్బులతో కొనుగోలు చేసిన భూమిలో గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మించగా, మిగిలిన స్థలంలో వీవో భవనం నిర్మించేందుకు సర్పంచ్ సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.