హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రత్యేక పిల్లల ప్రజావాణిలో చిన్నారుల వినతులు

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పిల్లల ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం చిన్నారులు కలెక్టర్ హరితకు ఫిర్యాదులు అందజేశారు. ఆసిఫాబాద్ మండలం వావుదంలో పాఠశాల భవనం నిర్మించాలని విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. ఎనిమిదేళ్లుగా గ్రామపంచాయతీ భవనంలోనే అరకొర వసతులతో 1 నుంచి 5వ తరగతి వరకు 41 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు.