SRD: కోహీర్ మండలం దిగ్వాల్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని టస్కిన్ గతేడాది పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించింది. దీంతో ఓ చిట్ ఫండ్స్ ఆధ్వర్యంలో ఆమెకు రూ.లక్ష నగదు ప్రోత్సాహక చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో జాకీర్ హుస్సేన్, ఉపాధ్యాయులు, సంస్థ ప్రతినిధులు పాల్గొని విద్యార్థినిని అభినందించారు.
తెలంగాణ
టస్కిన్కు రూ.లక్ష ప్రోత్సాహకం


