హైదరాబాద్: 28°C
తెలంగాణ

డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీకారం

BDK: భద్రాచలం పట్టణంలోని రెడ్ క్రాస్ భవనం వద్ద డయాలసిస్ సెంటర్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సోమవారం శంకుస్థాపన చేశారు. కేంద్రం అందుబాటులోకి వస్తే కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.