NZB: ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా కుటుంబ సభ్యుడు మరణిస్తే రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి పథకం వివరాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'కుటుంబ బీమాతో రూ.5 లక్షల సాయం'


