హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం దృష్టికి తీసుకెళ్తా: సీతక్క

BDK: బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామ సర్పంచ్ కిషోర్ నాయక్ సోమవారం హైదరాబాద్‌లో మంత్రి సీతక్కను కలిశారు. గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని కోరారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీలో చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.