హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఐనవోలులో భక్తుల సందడి

HNK: ఐనవోలులోని శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, శివలింగానికి అభిషేకాలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్తీకమాసంలో నదీ స్నానాలు, దీపారాధన చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని ఆలయ అర్చకుడు మధుశర్మ తెలిపారు.