హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోళ్ల కోసం రైతుల ఎదురుచూపులు

KNR: సైదాపూర్ మండలంలో వరి కోతలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు మొదలుకాలేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ కాంటాలు వేయడం లేదు. దీంతో సైదాపూర్–మొలంగూర్ ప్రధాన రహదారి వెంట ధాన్యం రాశులు పేరుకుపోయాయి. కాంటాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. అధికారులు వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.