హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణం కూల్చివేత

SRPT: అనంతగిరి మండలం ఖానాపురం గ్రామ శివారులో పెద్దచెరువు శిఖం భూమిలో చేపట్టిన అక్రమ గోడ నిర్మాణాన్ని అధికారులు తొలగించారు. ఆర్డీవో సూర్యనారాయణ సమక్షంలో ఈ చర్యలు చేపట్టారు. నిర్మాణంపై పెద్దచెరువు సంఘం సర్పంచ్ నాగేంద్రబాబు, సభ్యులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అధికారులు స్పందించి కూల్చివేత చేపట్టారు.