ASF: ఈజీ మనీకి అలవాటు పడి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని బెజ్జార్ SI రమేష్ హెచ్చరించారు. గ్రామీణ యువత మట్కా, జూదం, బెట్టింగ్ యాప్‌లకు బానిసై తక్కువ సమయంలో డబ్బు సంపాదించవచ్చని భావించడం తప్పన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. గంజాయి, గుడుంబా, కోడిపందేలు, పేకాటపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.
తెలంగాణ
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు


