వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన వస్త్రాలతో అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ
భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు


