హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో విద్యాభివృద్ధికి విరాళం..!

RR: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పాఠశాల భవనానికి చిల్కమరి గ్రామ సర్పంచ్ రవీందర్ రెడ్డి రూ.1 లక్ష విరాళంగా అందజేశారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ముందుకొచ్చిన సర్పంచ్‌ను ఎమ్మెల్యే అభినందించారు. విద్యాభివృద్ధికి దాతలు, ప్రజాప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు.