ADB: నేరడిగొండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహిళా సమైక్య కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఇవాళ మహిళా సంఘాల నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు స్వశక్తితో ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు. వారికి సంక్షేమ పథకాలు అందేలా తన వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు.
తెలంగాణ
మహిళా సమాఖ్య భవనం ప్రారంభించిన బోథ్ MLA


