హైదరాబాద్: 28°C
తెలంగాణ

కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

BDK: దమ్మపేట మండలం మొద్దులగూడెంలో కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వావలంబన సాధించడంతో పాటు కుటుంబ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు పాల్గొన్నారు.