హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాశీ విశ్వేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

WGL: GWMC 20వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గలో గల కాశీవిశ్వేశ్వర ఆలయంలో కార్తీకమాస ఉత్సవాల్లో భాగంగా నేడు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి శివయ్యకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పూలతో అలంకరణ చేసి,హారతి ఇచ్చారు. భక్తులు ఆలయానికి తరలివస్తుండగా, ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.