హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో ఆరేళ్ల బాలుడు పశువుల నీటి తొట్టిలో విగతజీవిగా కనిపించాడు. ఆదివారం ఆడుకోవడానికి వెళ్లిన బాలుడు సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో, కుటుంబసభ్యులు గాలించి, చీకటి పడ్డాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రాత్రి సుమారు 10.30 గంటలకు మృతదేహం లభించింది. ఘటనతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.