NLG: నార్కట్పల్లి మండలం చెరువుగట్టు దేవస్థానంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. వ్రత మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ ప్రాంగణంలో కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
చెరువుగట్టు ఆలయానికి పోటెత్తిన భక్తులు


