హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉమామహేశ్వర ఆలయంలో భక్తుల పూజలు

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్ర నగర్ కాలనీలో గల ఉమామహేశ్వర ఆలయాన్ని భక్తులు ఇవాళ పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు సమర్పించారు. ఆలయ అర్చకులు వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు సమర్పించి ఆశీర్వచనాలు అందజేశారు. దీంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.