హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెత్తమయంగా మారిన రహదారి.. పట్టించుకోని అధికారులు

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ గాడితప్పిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మదీనా కాలనీలోని ఏక్ మినార్ మసీదు రహదారికి ఇరువైపులా చెత్తాచెదారం కుప్పలుగా పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. అధికారులు తక్షణమే స్పందించి చెత్తను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.