SDPT: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని పరమశివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. శివనామస్మరణతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలంగాణ
కార్తీక మాసం తొలి సోమవారం.. పోటెత్తిన భక్తులు


