హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో.. మహిళ మృతి!

SRPT: చింతలపాలెం మండల కేంద్రంలో మొబైల్‌కు ఛార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌తో ఎర్రగొర్ల ఉపేంద్ర (44) మృతి చెందారు. ఛార్జర్‌ను ప్లగ్‌లో పెట్టే సమయంలో ప్లగ్ బాక్స్‌ వద్ద ఇన్సులేషన్‌ తొలగిపోయిన వైర్లు ఆమె చేతికి తగలడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. వివరాలు తెలియాల్సి ఉంది.