హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వీరభద్రస్వామివారికి సర్వాంగాభిషేకం

MHBD: కురవి కార్తీకమాస సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో స్వామివారికి ఘనంగా సర్వాంగాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.