హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 30న బంద్‌కు పిలుపు..!

HYD: ఈ నెల 30న ఆటోల బంద్‌కు ఆటో డ్రైవర్ల జేఏసీ పిలుపునిచ్చింది. పెంచిన ఆటో మీటర్ ఛార్జీలను 15 రోజుల్లో అమలు చేయాలని డిమాండ్ చేసింది. గ్రీన్ క్యాబ్లను నిషేధించాలని, ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని కోరింది. డిమాండ్లు నెరవేర్చకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అమానుల ఖాన్ హెచ్చరించారు.