హైదరాబాద్: 28°C
తెలంగాణ

KBHPలో భారీ అగ్నిప్రమాదం..!

HYD: KBHPలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో మంటలు చెలరేగినట్లు జరిగిందని స్థానికులు తెలిపారు. వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి తెలపడంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆకతాయిలు నిప్పు పెట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.