హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాసర గోదావరిలో పుణ్యస్నానాల సందడి!

నిర్మల్ జిల్లా కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో బాసర గోదావరి నదిలో తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వదిలారు. అనంతరం శ్రీ సురేశ్వర స్వామి వారి ఆలయంలో శివలింగానికి జలాభిషేకం, క్షీరాభిషేకం, బిల్వపత్రాలతో ప్రత్యేక అర్చనలు చేసి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.